Monday, April 25, 2011

స్కాలర్‌షిప్పుల పంపిణిలో మహిళా సంఘాల తమ చేతి వాటాము


స్కాలర్‌షిప్పుల పంపిణిలో మహిళా సంఘాల తమ చేతి వాటాము

  • మహిళా సంఘాల చేతివాటం
  • జనవరిలో వచ్చినా నేటికీ అందని వైనం
  • ఫోర్జరీ సంతకాలతో డబ్బులు స్వాహా

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వివిధ పథకాల ద్వారా వచ్చిన స్కాలర్‌షిప్పుల పంపిణిలో మహిళా సంఘాల సభ్యులు తమ చేతి వాటాన్ని ప్రదర్శించాయి. జనవరిలో వచ్చిన డబ్బులను ఇప్పటికీ విద్యార్థులకు పంపిణీ చేయకుండా స్వాహా చేశారు. ఫోర్జరీ సంతకాలతో అక్విడెన్స్‌లు సృష్టించి అందిన కాడికి దండుకున్నారు.పురుషులయితే దురలవాట్లకు బానిసై అవినీతి అక్రమాలకు పాల్పడుతారన్న ఉద్దేశంతో డబ్బుల పంపిణీ మహిళ సంఘాలకు అప్పగిస్తే వారు అసలుకే ఎసరు తెచ్చేలా వ్యవహరించడం చర్చానీయాంశమైంది.

కల్వకుర్తి మండలంలో జనశ్రీ, ఆమ్‌అద్మి, అభయహస్తం పథకాల కింద 8వ తరగతి నుండి ఇంటర్‌ చదివే విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్‌షిప్పులు మంజూరు చేసింది. మండలంలో మొత్తం 791 మంది విద్యార్థులకు గాను 5 లక్షలా 94,600 రూపాయలు మంజూరు చేసింది. వీటిని జనవరి మొదటి వారంలో మండల మహిళా సమాఖ్య అకౌంట్‌లో జమ చేసింది. మహిళా సంఘం వారు గ్రామ సంఘాలకు జనవరి రెండవ వారంలో చెక్కులు అందజేశారు. వారు తమ ఖాతాలో జమచేసుకున్నారే తప్ప విద్యార్థులకు చెల్లించలేదు. విద్యార్థులకు అందాల్సిన డబ్బులను తమ సొంత అవసరాలకు ఉపయోగించుకోవడం మహిళా సంఘాల పనితీరుకు అద్దం పడుతోంది.జనశ్రీ పథకం కింద 81 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 6వందల చొప్పున 48.600 రూపాయలు రాగా, ఆమ్‌ అద్మి పథకం కింద 200 మంది విద్యార్థులకు 1200 రూపాయల చొప్పున మొత్తం 2లక్షలా 40వేల రూపాయలు మంజూరయ్యాయి. అభయహస్తం పథకం కింద 510 మంది విద్యార్థులకు గాను 600 చొప్పున 3లక్షలా 600 రూపాయలు మంజూరయ్యాయి. ఈ డబ్బులన్నీ మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే వారు అందిన కాడికి దండుకున్నారు. కల్వకుర్తి పట్టణంలో మొత్తం 128 మంది విద్యార్థులకు 75వేల 600 రూపాయల స్కాలర్‌షిప్పు డబ్బులు మంజూరయ్యాయి. మహిళా సంఘాలు డబ్బులు సక్రమంగా పంపిణీ చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జనవరిలో వచ్చిన డబ్బులు ఇప్పటకీ కొంత మందికి చెల్లించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థులందరికీ డబ్బులు చెల్లించకపోవడం చూస్తుంటే వారి పని తీరు ఏ విధంగా ఉందో చెప్పకనే తెలుస్తోంది. డబ్బులు వారి అకౌంట్‌లో జమ అయిన తరువాత విద్యార్థులకు చెల్లించిన సందర్భంగా తీసుకున్న సంతకాల అక్విడెన్స్‌ ఇవ్వాలని అధికారులు మహిళా సంఘాలపై ఒత్తిడి తేవడంతో వారు ఫోర్జరీ సంతకాలతో అందజేసినట్లు వెలుగులోకొచ్చింది. స్కాలర్‌షిప్పులు పంపిణీ చేసిన జాబితాలను పరిశీలిస్తే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది విద్యార్థులకు 600 రూపాయలు మంజూరైతే వారికి 500 రూపాయలే చెల్లించి మిగతా వంద రూపాయలు ఖర్చులకు అంటూ నొక్కేసినట్లు తెలిసింది. కల్వకుర్తి పట్టణానికి చెందిన పసుల లక్ష్మీప్రియకు 600 రూపాయల స్కాలర్‌షిప్పు వస్తే మహిళ సంఘం వారు 500 రూపాయలు మాత్రమే చెల్లించారు. మార్చాల గ్రామంలో 81 మంది విద్యార్థులకు 3 పథకాల పేరు మీద డబ్బులు మంజూరయ్యాయి. జనవరిలో తమ అకౌంట్‌లో డబ్బులు జమ చేసుకున్నా గ్రామ మహిళా సంఘం నాయకురాలు విద్యార్థులకు సకాలంలో డబ్బులు చెల్లించలేదు. మొత్తం 120 మంది విద్యార్థులకు 91,200 రూపాయలు మంజూరు కాగా 90 మంది విద్యార్థులకు 40వేల రూపాయలు మాత్రమే చెల్లించారు. మిగతా 31 మందికి రావాల్సిన 54,600 రూపాయలు చెల్లించకుండా అవినీతికి పాల్పడ్డారు. ఈ తతంగం బయటపడడంతో మండలం మొత్తం ఇదే పరిస్థితి ఉన్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మార్చాల గ్రామంలో విద్యార్థులందరికీ జనవరిలోనే డబ్బులు చెల్లించినట్లు అధికారులకు అక్విడెన్స్‌ అందజేసి ఇప్పటికీ డబ్బులు చెల్లించకపోవడం చూస్తుంటే వారి అవినీతి ఎంత వరకు వెళ్లిందో చెప్పకనే తెలుస్తోంది. ఫోర్జరీ సంతకాలతో అక్విడెన్స్‌ అందజేసిన మహిళా సంఘంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. దాదాపు 54,600 రూపాయలు స్వాహా చేయడానికి ప్రయత్నించడం విమర్శలకు దారి తీస్తుంది. మండలంలో మొత్తం మీద 2 లక్షలకు పైగానే స్కాలర్‌షిప్పు డబ్బులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కల్వకుర్తి మండలంలో స్కాలర్‌షిప్పుల పంపిణీలో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా డబ్బులు రికవరీ చేయాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

మార్చాలలో అవినీతి జరిగిన మాట నిజమే...ఏపిఎం

మార్చాల గ్రామంలో విద్యార్థులు స్కాలర్‌షిప్పుల పంపిణీల్లో మహిళ సంఘం సభ్యులు అవినీతికి పాల్పడ్డ మాట నిజమేనని వారిపై చర్యలు తీసుకుంటామని కల్వకుర్తి ఏపిఎం యాదగిరి ప్రజాశక్తికి తెలిపారు. వారు జనవరి నెలలో 91వేయ్యి రూపాయల చెక్కును తీసుకెళ్ళారని వివరించారు. పిబ్రవరిలోనే విద్యార్థులకు డబ్బులు చెల్లించినట్లు తనకు అక్విడెన్స్‌ అందించారని ఆ అక్విడెన్స్‌ను పరిశీలిస్తే ఫోర్జరీ సంతకాలు ఉన్నట్లు తెలిపారు. దాదాపు 31 మంది విద్యార్థులకు 51వేల రూపాయలు అందించకుండా మహిళ సంఘం సభ్యులు నిర్లక్ష్యం వహించారని వారిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకుంటారని వివరణ ఇచ్చారు. మండలం మొత్తం మీద పరిస్థితి ఇదే మాదిరిగా ఉందా అంటూ ప్రశ్నించడంతో ఆయన నుండి సమాధానం రాలేదు.

Tuesday, April 5, 2011



సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన చికిత్సకు స్పందించడం లేదు. శరీరంలోని కీలక అవయవాలు పనిచేయడం మానేశాయి. ప్రస్తుతం బాబాకు వెంటిలేటర్‌ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు.

Monday, March 14, 2011

కల్లు కంపౌండు ఎత్తి వేయలంటు రిలే దిక్షాలు

కల్లు కంపౌండు ఎత్తి వేయలంటు రిలే దీక్షలు

మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి పట్టణంలొని గాందీనగర్ కాలనీలొ ఎలాంటి అనుమతి లేకుండా కోనసాగుతున్నకల్లు కంపౌండు ఎత్తి వేయలంటూ కాలనీ వాసులు గత కొంత కాలంగా ఎక్సైజ్ అధికారులను కోరినా వారు స్పందించ లేదు దింతో సోమవారం యువజన సంఘం సభ్యులు కల్లు కంపౌండు ఎదుటనే రిలే దిక్షా ప్రారంభించారు ఈ సందర్బంగా ఎక్సైజ్ అధికారులకు వ్యతిరెకంగా పెద్ద పెట్టునా నినాధలు అధికారులు దిగి వచ్చి కంపౌండు ఎత్తివెసే వరకు తమ ఆందోళన కార్యక్రమాలు కోనసాగిస్తామని హెచ్చరించారు.
video

Wednesday, November 24, 2010

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై ఆశలు ఆవిరి

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై ఆశలు ఆవిరి

- ఆశలు ఆవిరి
- డిజైన్ల మార్పులతో అసలుకే ఎసరు
- చోద్యం చూస్తున్న నాయకులు
- ఆందోళనలో రైతులు

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై ప్రాంత రైతుల ఆశలు ఆవిరి అవుతున్నాయి. పథకం డిజైన్ లో అనేక సార్లు మార్పులు చోటు చేసుకోవడం వల్ల అసలుకే ఎసరు వచ్చింది. ప్రాంతానికైతే సాగునీరు అందించాలని పథకాన్ని రూపొందించారో నేడు అదే ప్రాంతానికి చుక్క నీరు అందే అవకాశం లేకుండ పోయింది. పథకం విషయం కల్వకుర్తి రైతాంగానికి తీరని నష్టం జరుగుతున్నా అధికార పార్టీ నాయకులుగానీ, ప్రతి పక్ష పార్టీల నాయకులుగానీ స్పందించడం లేదు. దీనిబట్టి చూస్తుంటే వారికి ప్రాంత రైతులపై ఎంత ప్రేమ ఉందో చెప్పకనే తెలుస్తుంది. కేంద్రం పర్యావరణ శాఖ సైతం ఇటీవల పథకానికి అనుమతి ఇచ్చింది. 35 ఏళ్ళుగా సాగునీరు అందుతుందని వేయ్యి కళ్ళతో ఎదురు చూసిన రైతాంగానికి చివరకు నిరాశే మిగిలింది. పథకం ప్రారంభంలో కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలకు మూడు లిప్టుల ద్వారా సాగునీరు అందించాలని ప్రాణాళిక రూపొందించినప్పటికీ తరువాత నాయకులు డిజైన్ లో అనేక మార్పులు తీసుకు వచ్చారు. నాలుగు నియోజకవర్గాలతో పాటు వనపర్తి, జడ్చర్ల, నియోజకవర్గాలరు సైతం చేర్చడంతో కల్వకుర్తి ప్రాంతానికి చుక్కనీరు వచ్చే అవకాశాలు లేకుండా పోయాయి.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నా కలల పంట అంటూ నాయకుడంటే... మరో నాయకుడు పథకాన్ని సాధించకుంటే చట్ట సభల ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు. కానీ అలాంటి సంఘటనలు ఎప్ఫడూ పునరావృతం కాలేదు. ఎలాంటి సాగునీటి వనరులూ ఎలాంటి సాగునీటి వనరులూ లేని కల్వకుర్తి ప్రాంతానికి సాగునీరు అందించాలని నియోజకవర్గంలో అనేక ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమాల ఫలితంగా 1975 లో టి.అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్వకుర్తి ఎక్కువగా సాగునీరు అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. దానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంగా నామకరణం చేశారు. మొత్తం రెండు లక్షలా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ రూపొందించారు. ఇందులో కల్వకుర్తికి లక్ష ఎకరాలకు, అచ్చంపేట, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాలకు కలిపి లక్షా ఐదు వేల్ ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ రూపొందించారు. అప్పట్లో ఈ పథకం ప్రారంభించడం పట్ల రైతుల్లో హర్షం వ్యక్తమైంది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారకరామారావు ఈ పథకాన్ని సమీక్షించారు. వెంటనే దీనికి సంబంధించిన కార్యాలయాన్ని నాగర్ కర్నూల్ లో ఏర్పాటు సర్వే పనులకు ఆదేశించారు. సర్వే పనులు చకచకా కొనసాగి పథకానికి సంబంధించిన వివరాలన్ని ప్రభుత్వానికి చేరాయి. అప్పటి నుండి ఈ పథకం నాయకులకు ఎన్నికల నినాదంగా మారింది. 1999 వరకు ఎలాంటి పనులూ ప్రారంభించలేదు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొల్లాపూర్ సమీపంలోని రెగుమాన్ గడ్డ వద్ద ఈ పథకానికి శంకుస్ఠాపన చేసి, శిలాఫలకం వేశారు. 1,500 కోట్లతో పథకం చేపట్టి మూడు లిప్టుల ద్వారా రెండు లక్షలా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించాలని రూపొందించారు. ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టిన చంద్రబాబు ఈ పథకం గురించి పట్టించుకోలేదు. ప్రతి బడ్జెట్ లో నామమాత్రంగా విధులు కేటాయిస్తూ వచ్చారు. 2003 బడ్జెట్లో సైతం భారీగానే నిధులు కేటాయించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికలలో టిడిపి ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ ముఖ్యమంత్రి కావడంతోనే జలయజ్ణం పేరుతో ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిల్ తరువాత ఈ పథకం రూపురేఖలే మారిపోవడమే కాకుండా ౩౦ ఏళ్ళపాటు కొనసాగిన కల్వకుర్తి ఎత్తిపోతల పేరును మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంగా మార్చారు. అప్పటి వరకు 1,500 కోట్లతో పూర్తి కావాల్సిన పథకం మూడు వేల పైచిలుకు కోట్ల అంచనాలకు పెరిగింది.మూడు లక్షలా 60 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పింది. ఐదేళ్లు పూర్తి అయినా నాలుగో లిప్టుకు సంబంధించిన సర్వే పనులు పూర్తి కాలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ. ఎన్నికల్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నాలుగో లిప్టు తెరపైకి వచ్చింది. ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాలుగో లిప్టు చేపట్టి కల్వకుర్తి ప్రాంతానికి సాగునీరు అందిస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటిస్తుండగా.. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కల్వకుర్తి ఎత్తిఫోతల పథకం ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందేలా చర్యలు తీసుకుటామని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ ఈ పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందినాలుగో లిప్టు విషయంలో ఎలాంటి పురోగతి సాధించక పోవడం చూస్తుంటే ఈ పథకం తీరు ప్రశ్నార్ధకంగా మారిందని చెప్పొచ్చు. గత 35 ఏళ్ళుగా ప్రతి ఎన్నికల్లొనూ ఈ పథకం నాయకులకు ఓట్లు రాల్చుతుంది తప్పా ఆచరణలొ అమలుకు నొచుకొవడం లేదు.జలయజ్ఞం ద్వారా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తయి తమకు సాగునీరు అందుతుందని ఆశించిన ఈ ప్రాంత రైతులకు నిరాశే మిగిలింది.ఇటీవల మంత్రి , ఎమ్మ్యేల్యేలు విరుద్దమైన ప్రకటనలు చేస్తూ రైతులను గంగదరగోళానికి గురి చేస్తూన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(2) ద్వారా కల్వకుర్తి సాగునీరు అందిస్తామని భారీ నీటి పారుదల శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రకటిస్తే ......... జూరాల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందించే అవకాశాలున్నాయని ఎమ్మ్యేల్యే కిష్టారెడ్డి ప్రకటించారు. వీరి పొంతన లేని ప్రకటనలు చూస్తూంటే ఈ ప్రాంతానికి సాగునీరు వస్తుందా? అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో రైతుల సమస్యలపై మొసలి కన్నీరు కార్చే నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత వారి సమస్యలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో చెరువులు , కుంటలు తక్కువగా ఉండటం కారణంగా రైతన్నలు బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూన్నారు. విద్యుత్ సమస్య రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. బీటలు వారిన వ్యవసాయ పొలాలన్నీ సస్యశ్యామలమై రైతులు సుభిక్షంగా ఉండాలంటే ఈ ప్రాంతానికి సాగునీరు తప్పనిసరి అవసరం. ఇప్పటికైన పాలకులు మేల్కొని కల్వకుర్తి ప్రాంతానికి సాగునీరు అందించే పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది.
రిపోర్టీంగ్ .శ్రీనివాసులు, ప్రజాశక్తి

Wednesday, November 3, 2010

DSC -2008 Mahabubnagar list

DSC - 2008 New